
476views
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా పత్తాన్ ప్రాంతంలోని గోష్బుఘ్లో ఓ సర్పంచ్‌పై తూటాల వర్షం కురింపించారు. రక్తపుమడుగులో ఉన్న అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. చనిపోయిన సర్పంచ్ పేరు మంజూర్ అహ్మద్ అని పోలీసులు వెల్లడించారు. అతను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినట్టు చెప్పారు.





