264
-
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా నాయకుడిగా వ్యవస్థను ముందుండి నడిపించాలంటే, క్రమశిక్షణ, సహనం, నిరంతర అభ్యాసం, సంభాషణ తదితర అంశాలపై విద్యార్థి దశ నుంచే దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. నాయకుడు కావాలన్న దృఢ సంకల్పంతోపాటు ఈ అంశాలను అలవర్చుకున్నప్పుడే విజయాన్ని సాధించగలమని స్పష్టం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని వివిధ కళాశాలల్లో వివిధ కోర్సులను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులతో ఉపరాష్ట్రపతి ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.
రాజకీయాలతో పాటు ప్రతి రంగంలోనూ నాయకుడిగా ఎదిగేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని, అయితే, ఇందుకోసం కష్టించి పనిచేయడంతో పాటు అంకితభావం, ఇతరులపట్ల సహనంతో ఉండటం, క్రమశిక్షణ, అందరినీ కలుపుకుని పోయేతత్వం, సత్ప్రవర్తన వంటివి ఎంతో అవసరమని పేర్కొన్నారు.
Source: Nijamtoday