News

వందేమాత‌రం పాడ‌ని ఇద్ద‌రు కార్పొరేట‌ర్ల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

34views

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ మున్సిపాల్టీకి చెందిన ఇద్ద‌రు కార్పొరేట‌ర్లు.. వందేమాతరం గీతాన్ని ఆల‌పించ‌ని విష‌యం తెలిసిందే. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ బ‌డ్జెట్ స‌మావేశం స‌మ‌యంలో జాతీయ గీతం వందేమాత‌రాన్ని పాడేందుకు నిరాక‌రించారు. ఏప్రిల్ 8వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కాంగ్రెస్ కార్పొరేట‌ర్ ఫౌజియా షేక్ ఆలిమ్ వందేమాత‌ర గీతం పాడేందుకు వ్య‌తిరేకించారు. ఇస్లామిక్ విశ్వాసాల ప్ర‌కారం ఆ పాట పాడ‌లేన‌ని చెప్పిందామె. మ‌రో కాప్పొరేటర్ రూబినా ఇక్బాల్ ఖాన్ కూడా ఫౌజియాకు మ‌ద్దతు ప‌లికింది. స్వ‌తంత్ర్య కార్పొరేట‌ర్‌గా గెలిచిన రూబినా ఆ త‌ర్వాత కాగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ ఇద్ద‌రు జాతీయ గీతాన్ని ఆల‌పించేందుకు నిరాక‌రించారు. బీజీరోడ్డ పోలీసు స్టేష‌న్‌లో 196 బీఎన్ఎస్ సెక్ష‌న్ కింద ఫౌజియా, రుబినాపై కేసు న‌మోదు అయ్యింది. ఆ ఇద్ద‌రికీ స‌మ‌న్లు ఇచ్చిన పోలీసులు గ‌డిచిన రెండు రోజుల పాటు వారిని విచారించారు. వారి వ‌ద్ద నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కాగ్నిజ‌ల్ అఫెన్స్‌గా భావిస్తూ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. స‌మ‌గ్ర‌రీతిలో ఈ కేసును విచారిస్తున్న‌ట్లు చెప్పారు.