గౌహతి: హిజాబ్‌ను సమర్థిస్తూ నినాదాలు చేసిన కర్ణాటక విద్యార్థిని ముస్కన్ ఖాన్‌ను ప్రశంసిస్తూ ఆల్ ఖైదా చీఫ్ అయ్మాన్ అల్ జవహరి విడుదల చేసినట్టుగా పేర్కొంటున్న వీడియోపై దేశంలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యాసంస్థలలో యూనిఫాం ప్రాముఖ్యతను అల్ ఖైదా అర్థం చేసుకోలేదని, కానీ భారతీయ ముస్లింలు అర్థం చేసుకుంటారని ఆయన భరోసా వ్యక్తం చేశారు.
కర్నాటక హైకోర్టు ఆమోదించిన ప్రభుత్వ హిజాబ్ నిషేధాన్ని సమర్ధిస్తూ, అసోం సిఎం మతపరమైన దుస్తులను నిరోధించకపోతే, విద్యాసంస్థలు మత ప్రవర్తనల ప్రదర్శనకు వేదిక అవుతాయని ఆయన హెచ్చరించారు. అల్ ఖైదా చీఫ్ ఐమన్ అల్-జవహిరి 8.43 నిమిషాల క్లిప్‌ను విడుదల చేశారు, అందులో ముస్కాన్ ఖాన్ జై శ్రీరాం అని నినాదాలు చేస్తున్న అబ్బాయిల గుంపును ప్రతిఘటించిన వీడియో వైరల్‌గా మారింది.
Source: Nijamtoday