
502views
-
భారత విదేశాంగ శాఖ స్పష్టం
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై న్యూఢిల్లీ ఒక మార్గం ఎంచుకోవాల్సి వస్తే శాంతి మార్గాన్నే ఎంచుకుంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. ఉక్రెయిన్‌లో పరిస్థితిపై లోక్‌సభలో చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ సిటీ బుచాలో పౌరులను ఊచకోత కోస్తున్నట్టు వస్తున్న వార్తలు భారత్‌ను తీవ్రంగా కలిచివేస్తున్నట్టు చెప్పారు.
”రక్తపాతం, అమాయక ప్రజల ప్రాణాలు తీయడం వల్ల ఏ సమస్యకు పరిష్కారం కనుగొనలేం. నేటియుగం, ఇవాల్టి పరిస్థితుల్లో చర్యలు, దౌత్యం వల్లే ఎలాంటి సమస్యకైనా సరైన సమాధానం దొరుకుతుంది” అని జైశంకర్ అన్నారు. ఇండియాను ఏదోఒక మార్గం ఎంచుకోమని అంటే ఇండియా శాంతి మార్గం వైపే ఉంటుందని, హింసకు తక్షణం ముగింపు పలకాలంటే ఇదే మార్గమని అన్నారు.





