News

వ్యవసాయ రంగంలోకి విశ్రాంత సైనికులు

519views

* ‘మేనేజ్’ పథకం ద్వారా విశ్రాంత సైనికులకు శిక్షణనందించనున్న కేంద్ర ప్రభుత్వం

దవీ విరమణ పొందిన రక్షణ శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇక వ్యవసాయంలో శిక్షణ ఇవ్వనుంది. ‘మేనేజ్’ అనే పథకంతో సైన్యం నుంచి రిటైరైన విశ్రాంత సైనికులకు వ్యవసాయ మార్కెటింగ్ తోపాటు వ్యవసాయానికి ఉపయోగపడే ఆధునిక టెక్నాలజీ, పరికరాల వాడకంపై శిక్షణనివ్వనుంది. మొదట 30 మంది విశ్రాంత సైనికులు ఒక బ్యాచ్ గా మొత్తం 4 బ్యాచ్ లకు జూలై నుంచి నుండి హైదరాబాద్ లో శిక్షణ ఇస్తుంది. వ్యవసాయ అనుబంధ రంగానికి నిపుణుల కొరత ఉందని, క్రమశిక్షణ, దేహ దేహ దారుఢ్యం కలిగిన సైనికులు అన్నదాతలుగా మారితే సేద్యంలో విప్లవాత్మక మార్పులు చూడవచ్చని కేంద్రం భావిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.