
517views
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై CM జగన్ మోహన్ రెడ్డికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు తెలిపారు. ‘కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏకీకృత అభివృద్ధికి బాటలు పడతాయి. రాష్ట్ర పాలనా చరిత్రలో నవశకానికి నాంది పలికారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వ పాలనలో మరింత పారదర్శకత లభిస్తుంది. ఒకే ప్రాంగణంలో అన్ని కార్యాలయాల ఏర్పాటు మంచి ఆలోచన’ అని గవర్నర్ CM ను అభినందించారు.





