
* ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్ లేఖ
ఉత్తర ప్రదేశ్ లోని ఓ నగరం పేరు మార్పుపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్ లేఖ రాశారు. ఫరూఖాబాద్ నగరం పేరును పాంచల్ నగర్‌గా పేరు మార్చాలని ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌కు చెందిన బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు. ఫరూఖాబాద్ నగరం పేరు మత ప్రాతిపదికగా ఉన్నందున దాన్ని పాంచల్ నగర్‌గా పేరు మార్చాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఫరూఖాబాద్ సంస్కృతికి చారిత్రక పునరుజ్జీవనం కావాలని ఆయన లేఖలో వాదించారు.‘‘ఫరూఖాబాద్‌కు మహాభారత యుగంతో సంబంధాలు ఉన్నాయి. ద్రుపద రాజు రాజధాని ఒకప్పుడు ఇక్కడ ఉండేది.ఈ నగరాన్ని పాంచాల ప్రాంతం అని పిలుస్తారు. ద్రౌపది యొక్క స్వయంవరం ఈ నగరంలో జరిగింది. పాండవులు వారి అజ్ఞాతవాస సమయంలో ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు, అది ఇప్పటికీ ఉంది.’’ అని ఎంపీ ముఖేష్ లేఖలో పేర్కొన్నారు. ‘‘ఈ నగరం పాంచల్ రాజ్యానికి రాజధానిగా ప్రసిద్ధి చెందింది. నేడు ఇక్కడ రాజ్‌పుత్ రెజిమెంట్, సిఖ్లాయి రెజిమెంట్ అనే రెండు ప్రధాన రెజిమెంట్‌లు ఉన్నాయి’’ అని రాజ్‌పుత్ లేఖలో రాశారు.భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి పాంచల్ నగర్ పేరు పెట్టాలని కోరుకుంటున్నట్లు ఎంపీ చెప్పారు.‘‘క్రీస్తుశకం 1714లో మొఘల్ పాలకుడు ఫరూక్సియార్ భారతీయ చారిత్రక సంస్కృతిని నాశనం చేసే ఉద్ధేశంతో ఈ చారిత్రక నగరానికి తన పేరు మీదుగా ఫరూఖాబాద్ అని పేరు పెట్టాడు. అందుకే భారతీయ సంస్కృతిని పునరుద్ధరించేందుకు ఫరూఖాబాద్ పేరును పాంచల్ నగర్‌గా మార్చాలని కోరుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశాను పాంచల్ నగర్ లేదా అపరకాశీ అని పేరు మార్చాలని సీఎంను కోరాను’’ అని ఎంపీ వివరించారు. ఈ నగర వీధుల్లో ఉన్న శివాలయం కారణంగా అపరకాశి అని కూడా పిలుస్తారని ఎంపీ తెలిపారు.






