
జమ్మూకశ్మీర్: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో పోలీసులు, ఆర్మీ సిబ్బందిపై దాడులు ఆగడం లేదు. ఉగ్రవాదులు కొన్నిసార్లు పెట్రోలింగ్‌లో ఉన్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు పోలీసులు, భద్రతా దళాల శిబిరాలపై దాడులు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ సిబ్బందిపై దాడులకు తెగబడుతున్న ఓ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
बुर्के में सापोर कश्मीर में बम फेंका गाया । pic.twitter.com/tgKpqoSg4O
— Amish Devgan (@AMISHDEVGAN) March 29, 2022
దేశంలో హిజాబ్‌పై వివాదం నడుస్తుండగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన తరుణంలో జమ్మూకశ్మీర్‌లో బురఖా ధరించిన ఓ మహిళ(?) సీఆర్పీఎఫ్ బంకుపై పెట్రోల్ బాంబు విసిరి అక్కడి నుంచి పారిపోయిన ఘటన వెలుగుచూసింది.
ఈ సంఘటన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటపడింది. సాధారణ రోజులాగే ప్రజలు రోడ్డుపై నడుస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇంతలో బురఖా ధరించిన ఓ మహిళ అటుగా వెళుతోంది. బురఖా మహిళ చేతిలో బ్యాగ్ ఉంది.
సీఆర్‌పీఎఫ్ బంకరును చూసిన ఆ మహిళ తన బ్యాగ్‌లో ఉన్న పెట్రోల్ బాంబును తీసి బంకర్‌పై విసిరి అక్కడి నుంచి పారిపోయింది. బంకర్‌పై దాడి జరిగిన తర్వాత అక్కడ మంటలు చెలరేగడంతో భద్రతా సిబ్బంది మంటలను నీటితో చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వీడియోలో కనిపించింది. బంకర్‌పై మహిళ చేసిన పెట్రోల్ బాంబు దాడిలో ఏ జవాన్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడం ఉపశమనం కలిగించింది.
Source: Nijamtoday