News

టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట ఆలయ నిర్వహణ

564views

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి బృహత్‌ ప్రాజెక్టును దేవాదాయశాఖతోపాటు యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ చేపడుతోంది. అద్భుతంగా ఆలయం అభివృద్ధి చెందడంతోపాటు… పెద్దఎత్తున వసతుల కల్పన జరిగిన దృష్ట్యా నిర్వహణ అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతోంది. భారీస్థాయిలో అభివృద్ధి, విస్తరణ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న విధానం ఆలయ నిర్వహణ, పాలనకు సరిపోదని అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రత్యేక ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని, పాలక మండలి అదే రకంగా ఉండాలని అంటున్నారు.

టీటీడీ తరహాలో ఐఏఎస్ అధికారిని, కార్యనిర్వహణాధికారిగా నియమించే విధానం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. జేఈఓ, డిప్యూటీ ఈఓ, ఏఈఓ తదితర పోస్టుల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నారు. దేవాదాయశాఖ పరిధిలోనే టీటీడీ తరహా వ్యవస్థ, విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో సర్కార్ కనిపిస్తోంది. ఈనెల 28న మహాకుంభ సంప్రోక్షణ పరిపూర్ణం కానుంది. ఆ రోజు నుంచి భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది. ఆ తర్వాత ఆలయ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి