News

భారత్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పర్యటన

471views
  • నేడు భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో భేటీ

  • సరిహద్దుతో సహా చర్చకు రానున్న పలు అంశాలు

న్యూఢిల్లీ: భారత్​లో పర్యటిస్తున్న చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్​తో నేడు భేటీ కానున్నారు.

ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా పాకిస్థాన్‌ పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం వాంగ్‌ యీ దిల్లీ చేరుకున్నారు. అయితే, పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాంగ్‌యీ… తాజాగా భారత్‌లో పర్యటించడం గమనార్హం. ఇక గల్వాన్‌ ఘటన(రెండేళ్ల) తర్వాత సీనియర్ స్థాయి చైనా నేత మనదేశంలో పర్యటించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి