News

ఐక్యరాజ్య సమితి యాంటీ ఇస్లామోఫోబియా డేపై భారత్ తీవ్ర ఆందోళన

447views

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ అసెంబ్లీ ప్రతీ ఏడాది మార్చి 15వ తేదీని ‘యాంటీ-ఇస్లామోఫోబియా డే’గా పాటించాలని ప్రకటించింది. దీనిపై భారత్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఒక మతం అంటే భయం ఏ స్థాయికి చేరిందంటే, దానికోసం ఇంటర్నేషనల్ డే పాటించే పరిస్థితి తలెత్తిందని భారత్ వ్యాఖ్యానించింది. వివిధ మతాలపై విభిన్న మార్గాల్లో భయాన్ని సృష్టిస్తున్నారని పేర్కొంది.

ప్రతీ ఏటా మార్చి 15వ తేదీని ఇస్లాం భయంపై పోరాట దినంగా ‘ఇంటర్నేషనల్ డే టు కంబాట్ ఇస్లామోఫోబియా’గా జరుపుకోవాలని భారత్ ప్రతిపాదన తెచ్చింది. ఓఐసీలోని 57 సభ్య దేశాలతో పాటు చైనా, రష్యా వంటి మరో 8 దేశాల మద్దతుతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది.

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై హింస, వివక్ష, ద్వేషాన్ని ఆపేందుకుగానూ ఈ తీర్మానాన్ని అమోదించినట్లు చెబుతున్నారు.తాజా తీర్మానం… ఒక నిర్దిష్ట మతం పట్ల తన స్వరాన్ని వినిపిస్తుందని, అదే సమయంలో ఇతర మతాలపై జరుగుతోన్న అకృత్యాలను విస్మరిస్తుందని భారత్ నమ్ముతోంద‌ని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి