
479views
ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, EU లు రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై నిషేధం విధించాయి. తాజాగా అమెరికాకు పుతిన్ రివర్స్ కౌంటరిచ్చారు. US ప్రెసిడెంట్ జో బైడెన్, హిల్లరీ క్లింటన్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో సహా మొత్తం 12 మంది అగ్రనేతలు రష్యాలో ప్రవేశించకుండా పుతిన్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు మంగళవారం రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. యూఎస్ విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిల్లీ తదితరులు ఆ లిస్టులో ఉన్నారు.





