ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా సోన్‌పూర్ సమీపంలో మావోయిస్టులు ఓ పోలీసును పొట్టన పెట్టుకున్నారు. వీరు జరిపిన పేలుళ్ళలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎ.ఎస్.ఐ) రాజేంద్ర సింగ్ వీరమరణం పొందారు. ఆ పేలుడులో హెడ్ కానిస్టేబుల్ మహేష్ బోడ్రో కూడా గాయపడగా, చోటేడోంగర్ వద్ద జరిగిన మరో పేలుడులో కానిస్టేబుల్ సోయం భీమా తీవ్రంగా గాయపడ్డాడు.
ఐటీబీపీ 53వ బెటాలియన్‌కు చెందిన బృందం మావోయిస్టు పీడిత దట్టమైన అడవిలో రోడ్డు నిర్మాణ కార్మికులకు భద్రత కల్పిస్తున్నప్పుడు పేలుళ్ళులు సంభవించాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ పి తెలిపారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సోన్‌పూర్, ధొండరిబెడ గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది.
మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో, నక్సల్స్ చోటేడోంగర్ దగ్గర జరిపి పేలుళ్ళలో ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ (సిఎఎఫ్)కి చెందిన కానిస్టేబుల్ భీమ్‌తో గాయపడ్డారు.
Source: HINDU POST