
-
యాప్‌లో పాక్ కరెన్సీ
జమ్మూకశ్మీర్: ప్రముఖ సంస్థ ఊబర్ తీరు వివాదాస్పదమైంది. జమ్మూ- కశ్మీర్‌లో పాకిస్తాన్ రూపాయి (పీకేఆర్)ని కరెన్సీగా చూపించడంపై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. పేమెంట్ చేసే చోట భారత రూపాయిని చూపించకుండా పాకిస్తాన్ కరెన్సీని ప్రదర్శిస్తోందని ట్విట్టర్ వినియోగదారులు ఆరోపించారు. కౌశల్ రైనా (@ALkohliC)గా గుర్తించబడిన వినియోగదారుడు“PKR currency in wallet balance in Jammu, J&K, India???” అని రాశారు. ‘personal’ చెల్లింపుల విభాగం కింద పాకిస్తాన్ రూపాయలలో ‘Uber Cash’ ప్రదర్శించబడే స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశాడు.
మరో ట్వీట్‌లో ఊబర్ యాప్ జమ్మూ కశ్మీర్‌లో పనిచేయదని, ఢిల్లీలో రైడ్ కోసం ఈ మొత్తం చూపబడిందని వినియోగదారుడు తెలిపాడు. “నేను దీన్ని చూసినప్పుడు నేను ఢిల్లీలో ఒకరి కోసం క్యాబ్ బుక్ చేస్తున్నాను” అని కౌశల్ రైనా జోడించాడు.
జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఓబెర్ ద్వారా కరెన్సీని పాకిస్తాన్ రూపాయిలలో సూచించడం పట్ల సోషల్ మీడియా వినియోగదారులు విస్తుపోయారు. ఊబర్ యాప్‌ను సవరించుకోవాలని, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని వ్యాపార కార్యకలాపాలలో ఆర్థిక నష్టాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు.
“Shame on you, Uber. J&K is an integral part of India. Why are you doing this kind of activity? #BoycottUber. Let’s make this issue viral,” అని మరొక యూజర్ ట్వీట్ చేశారు.
“Will start to boycott Uber if they don’t give a written explanation.” అంటూ మరొకరు ట్వీట్ చేశారు.