
-
‘ఆపరేషన్ గంగా’ను ప్రశంసించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
న్యూఢిల్లీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ట్యునీషియా వంటి దేశాల నుండి ఉక్రెయిన్ వెళ్ళి, అక్కడ చిక్కుకుపోయిన అనేక మంది దక్షిణాసియావాసులను స్వస్థలాలకు తరలించి, రక్షించడంతో మోదీ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ‘ఆపరేషన్ గంగా’ కింద తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరులను ఉక్రెయిన్ నుండి రక్షించడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో నేపాల్, ట్యునీషియా విద్యార్థులను కూడా రక్షించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్తానీ అమ్మాయి అస్మా షఫీక్‌ను భారత అధికారులు రక్షించారని, ప్రస్తుతం పశ్చిమ ఉక్రెయిన్‌కు వెళ్తున్నారని నివేదికలు తెలిపాయి. “ఆమె త్వరలో తన కుటుంబంతో తిరిగి కలుస్తుంది” అని ఓ న్యూస్ తెలిపింది.
“మేము చాలా క్లిష్ట పరిస్థితిలో చిక్కుకున్నందున ఇక్కడ మాకు అన్ని విధాలుగా మద్దతు ఇచ్చినందుకు కైవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను” అని పాకిస్తానీ అమ్మాయి చెప్పింది. తనకు మద్దతుగా నిలిచినందుకు ప్రధాని మోదీకి అస్మా షఫీక్ కృతజ్ఞతలు తెలిపారు.
భారతదేశం దక్షిణాసియా పొరుగు దేశాల పౌరులు, ఇతర దేశాల పౌరులను వారు కోరుకుంటే ఉక్రెయిన్ నుండి బయటకు తీసుకురావడానికి ప్రధాన మంత్రి మోదీ ఇటీవల సహాయం అందించారు.
Source: Organiser