News

ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీతో మాట్లాడిన‌ ప్రధాని మోదీ

436views

న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. 35 నిమిషాల పాటు జరిగిన ఈ ఫోన్​కాల్​లో ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించారు. సమస్య పరిష్కారం కోసం రష్యాతో చర్చలు కొనసాగిస్తుండటంపై ఉక్రెయిన్​ను మోదీ అభినందించారు.

ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో ఉక్రెయిన్​ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. సుమీలోని భారతీయులను తరలించడంలో కూడా ఉక్రెయిన్​ తన సహకారాన్ని అందించాలని ప్రధాని కోరారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి