News

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటానికి ప్రయత్నించిన ముష్కరుడికి 16 ఏళ్ల జైలు శిక్ష…

468views

* హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించాలని ప్రయత్నించిన అజీజ్

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి కుట్ర పన్నిన కేసులో నిందితుడు అబ్దుల్‌ అజీజ్ ‌కు తెలంగాణలోని నాంపల్లి కోర్టు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ మెహదీపట్నం ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ అజీజ్‌ 2001లో రెండు వర్గాల మధ్య వైరుధ్యం సృష్టించేందుకు కుట్ర పన్నాడు. అందులో భాగంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో.. అజీజ్ ‌ను సిట్‌ పోలీసులు అరెస్టు చేశారు.

అతని వద్ద నుంచి బెల్జియం తుపాకీతో పాటు 5 తూటాలు, డిటోనేటర్లు, నకిలీ పాస్‌పోర్ట్ ‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు అబ్దుల్‌ అజీజ్ ‌కు 16 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు 26 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.