
624views
ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులను కట్టడి చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ…. మరోసారి భారత్ మద్దతు కోరారు. రష్యాతో భారత్ కు ప్రత్యేక అనుబంధం ఉన్న కారణంగా తమ దేశంపై చేస్తున్న దాడులను ఆపమని పుతిన్ సర్కారును భారత్ కోరాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. భారత్ సహా ప్రపంచ దేశాలు రష్యాపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు.
“ఈ యుద్ధానికి ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకమని రష్యా మిత్ర దేశాలన్నీ పుతిన్ కు విజ్ఞప్తి చేయాలి. ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఈ యుద్ధం ఇలా కొనసాగితే పంటలు పండించలేము. ఇది అంతర్జాతీయంగా కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి.. ఇవన్నీ పరిగణించి ఈ యుద్ధాన్ని ఆపేయడమే మంచిది” అని కులేబా పేర్కొన్నారు.





