News

ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయాలను విముక్తి చేస్తాం!

599views
  • బ‌డ్జెట్ స‌మావేశంలో క‌ర్ణాట‌క బీజేపీ స‌ర్కారు ప్ర‌క‌ట‌న

బెంగ‌ళూరు: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాలకు విముక్తి కల్పిస్తామని క‌ర్ణాట‌కలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ సెషన్‌లో ప్రకటించింది. ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసేందుకు తమ ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందని గతేడాది కర్ణాటక ముఖ్య‌మంత్రి బసవరాజ్ బొమ్మై హామీ ఇచ్చారు. దేవాలయాలకు విముక్తి కల్పించడం అనేది కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల్లోని హిందువుల చిరకాల డిమాండ్లలో ఒకట‌న ముఖ్యమంత్రి తన ప్రసంగంలో అంగీకరించారు.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో సీఎం బొమ్మై మాట్లాడుతూ బడ్జెట్‌ సమావేశాలకు ముందు ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసేందుకు తమ ప్రభుత్వం చట్టం తీసుకువస్తుందని చెప్పారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి