NewsProgramms

ఆంధ్రప్రదేశ్ అంతటా ఘనంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

513views

భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రైతులు, రైతు కూలీలు భారతీయ కిసాన్ సంఘ్ కు శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు రైతుల ఐక్యత వర్ధిల్లాలి, లాభసాటి ధర సాధిద్దాం, భగవాన్ బలరామ్ కీ జై అంటూ నినాదాలు చేశారు.

కృష్ణా జిల్లాలో….

తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడులో…

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామనే కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తోందే తప్ప రైతులకు లాభం కలిగే దిశగా ప్రయత్నించిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో రైతులకు కావలసినది లాభసాటి ధర గానీ, గిట్టుబాటు ధర కాదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. “ఎల్లకాలమూ ఏదో బొటాబొటిగా గిట్టుబాటయ్యే ధరలకు రైతు తన వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకుంటూ వస్తే…. మరి వ్యవసాయం లాభసాటిగా మారేదెప్పుడు? రైతు కష్టాలు గట్టెక్కేదెప్పుడు? కనుక రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర కాదు. లాభసాటి ధర. ప్రభుత్వాలన్నీ ఆ దిశగానే ప్రయత్నించాలి. వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధర కల్పించే దిశగా కృషి చేయాలి.” అని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

రైతులు ఎప్పుడైనా, ఎక్కడైనా స్వేచ్ఛగా తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలచిన రెండు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే పరిస్థితిని కొన్ని తీవ్రవాద సంస్థల, విదేశీ శక్తుల దన్నుతో కొంతమంది దళారులు సృష్టించారని కిసాన్ సంఘ్ నాయకులు వాపోయారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించి రైతుల కష్టాలను తొలగించే ప్రయత్నం చెయ్యాలని వారు ప్రభుత్వాలకు విన్నవించుకున్నారు.

రైతులు, రైతు కూలీలు ఉత్సాహంగా పాల్గొన్న భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర, జిల్లా నాయకులు పలువురు పాల్గొని ప్రసంగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.