
కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమును కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వనుంది. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 వేలు రాబోతున్నాయి.
దీనితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అడ్వాన్స్ గా రూ.10 వేలను ఇవ్వనున్నారు. ఈ మొత్తానికి ఎలాంటి వడ్డీనీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాల్సినవసరం లేదు. అయితే ఈ స్కీమ్ ని పొందాలంటే మార్చి 31, 2022 ఆఖరు తేదీ. గతేడాది కూడా ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రం ఈ స్కీమును తీసుకు వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందే ఈ డబ్బులను 10 ఇన్‌స్టాల్‌మెంట్ల లో తిరిగి చెల్లించుకోవచ్చు. నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్ గా కేవలం రూ. వెయ్యి చెల్లిస్తే సరి పోతుంది. ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద రూ.4 వేలు నుంచి రూ.5 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రాలు కూడా ఈ స్కీమ్ ను అమలు చేయాలనుకుంటే రూ.8 వేల నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అడ్వాన్స్ ని డిజిటల్ గానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.





