News

యాగంటి నంది పెరుగుతున్నది నిజమే – శాస్త్రవేత్తల వెల్లడి

675views

ర్నూలు జిల్లా యాగంటి గ్రామంలో ఉన్న ఉమా మహేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూర్వం ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండటం వల్ల నంది చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేవారని చెబుతారు. కానీ ప్రస్తుతం అక్కడ ప్రదక్షిణలు చేయడానికి వీలు లేకుండా మొత్తం నంది విగ్రహం పెరిగి పోయింది. అయితే ఈ నంది విగ్రహాన్ని ఎవరూ ప్రతిష్టించలేదు.ఆలయ నిర్మాణం తరువాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఈ నందిపై భారత పురావస్తు శాఖ అధికారులు జరిపిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. 20 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పెరుగుదల కనిపిస్తుందని, అది కేవలం ఒక ఇంచు మాత్రమే పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా రాళ్ళల్లో కొన్ని రసాయనాలు ఉండటం వల్ల, అది వర్షంతో చర్య జరిగి వాటి పెరుగుదలకు తోడ్పడతాయి. కానీ నంది విగ్రహం ఆలయ ప్రాంగణంలో వర్షానికి తడవకుండా ఉండడం, కేవలం గాలిలో ఉండే తేమతో చర్య జరపడం వల్ల పెరుగుదల చాలా ఆలస్యంగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

కాలజ్ఞానం లో వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కలియుగం అంత మయ్యేటప్పుడు ఈ నంది లేచి రంకెలు వేస్తుందని తెలిపారు. అప్పుడే కలియుగం కూడా అంతం అవుతుందని తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు. అందులో పేర్కొన్నట్లుగానే ఇక్కడ ఉన్న నంది రోజు రోజుకి పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

ఈనాడు సౌజన్యంతో…..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.