News

ఇద్దరు బంగ్లాదేశ్ దొంగ‌ల అరెస్ట్‌

580views

ముంబై: ఖార్ఘర్‌లోని ఒక ఆలయంలో కింద‌టి నెల దొంగతనానికి పాల్పడిన ఇద్దరు బంగ్లాదేశ్ జాతీయులను నవీ ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 80,000 నగదు, దొంగిలించిన మూర్తిలను స్వాధీనం చేసుకున్నారు.

ఇక్కడ విలేఖ‌రుల సమావేశంలో నవీ ముంబై పోలీస్ కమిషనర్ బిపిన్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, జనవరి 31, 2022న ఖార్ఘర్‌లోని ఇస్కాన్ ఆలయం నుండి మూడు నగదు పెట్టెలు, కొంత నగదు, మూర్తిలను దొంగిలించారు. సెంట్రల్ క్రైమ్ యూనిట్ అధికారులు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసి, ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత పోలీసులు నిందితుల‌ను ప‌ట్టుకున్నార‌ని తెలిపారు.

‘రాజు’ ఫర్హత్ షేక్(26), అమీరుల్ అలియాస్ ‘ఆకాష్ మన్నన్’ ఖాన్(23) ల‌ను నవీ ముంబైలో అరెస్టు చేసినట్టు సింగ్ తెలిపారు. ఏజెంట్ సహాయంతో బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ సరిహద్దు ద్వారా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించార‌న్నారు.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి