News

హర్ష అంతిమ యాత్రపై కూడా అల్ల‌రి మూక‌ల రాళ్ళు!

778views

బెంగ‌ళూరు: కర్ణాటక రాష్ట్రం శివ మొగ్గ జిల్లా కేంద్రంలో ఆదివారం (ఫిబ్రవరి 20) రాత్రి కామత్ పెట్రోల్ బంక్ సమీపంలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను క‌త్తుల‌తో పొడిచారు. కొనఊపిరితో కొట్టిమిట్టాడుతున్న హర్షను మెక్ గన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు ప్రాణాలను వదిలాడు.

మరణించిన 26 ఏళ్ల హిందూ కార్యకర్త హర్ష అంత్యక్రియల ఊరేగింపు శివమొగ్గలోని జిల్లా మెక్‌గన్ ఆసుపత్రి నుండి వద్యనగర్‌లోని రోటరీ శ్మశానవాటికకు సాగింది. పెద్ద ఎత్తున ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సమయంలో అంతిమ యాత్ర ఊరేగింపుపై దుండగులు దాడి చేశారు.

అంత్యక్రియల ఊరేగింపుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వడంతో ముగ్గురు గాయపడ్డారు. ఈ దాడిలో ఒక పోలీసు, ఒక ఫోటో జర్నలిస్ట్, ఒక మహిళతో సహా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ప‌లు నివేదికలు తెలిపాయి. దాడికి సంబంధించిన దృశ్యాలను న్యూస్ 9 రిపోర్టర్ ప్రియాంక రుద్రప్ప సోషల్ మీడియాలో షేర్ చేశారు.

భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ రాళ్ల దాడి చోటు చేసుకుంది. 20 వాహనాలు ధ్వంసమయ్యాయని, కొన్నింటికి నిప్పంటించారని పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చి ఆ తర్వాత అంతిమ యాత్ర సజావుగా సాగింది. వార్తా సంస్థ ఎ.ఎన్.ఐ షేర్ చేసిన చిత్రాల ప్రకారం, పోస్ట్‌మార్టం తర్వాత పోలీసు భద్రత మధ్య హర్ష భౌతికకాయాన్ని అతడి నివాసానికి తీసుకెళ్తుండగా వందలాది మంది ఊరేగింపులో పాల్గొన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి