News

విజయవాడలో అఖండ కచ్ఛపి మహోత్సవం

488views
  • 12 గంటల పాటు నిర్విరామంగా వీణా నాదం

విజయవాడ: విజయవాడ శివరామక్షేత్రంలో అఖండ కచ్ఛపి మహోత్సవం ప్రారంభమైంది. సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో షష్టి వార్షిక మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సంగీత విద్వాంసులు 12 గంటల పాటు నిర్విరామంగా వీణానాదం చేయనున్నారు. ఇవాళం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన వీణానాదం కార్యక్రమం రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ వీణా విద్వాంసులు తరలివచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి