News

54 చైనా యాప్‌లపై ఉక్కుపాదం!

541views
  • నిషేధించిన మోడీ సర్కారు

  • భారతీయుల సమాచారాన్ని తస్కరిస్తున్నట్టు ఆరోపణ

న్యూఢిల్లీ: చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే కారణంతో 54 చైనా యాప్‌లపై నిషేధం విధించనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ, ఈక్వలైజర్ అండ్‌ బాస్ బూస్టర్, వివా వీడియో ఎడిటర్, యాప్‌లాక్, డ్యూయల్ స్పేష్ లైట్ వంటివి ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి