
సకల దేవతల స్వరూపమే గోమాత అని బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కర్నూలు నగరంలోని సుంకేసుల రోడ్డులో గల డిగ్రీ, పీజీ కళాశాల్లో ఆయన ‘గోమాత వైభవం’పై ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. హిందూ ధర్మశాస్త్రాల్లో, వేదాల్లో, భారత, రామాయణ, భాగవతాల్లో గోమాతను గొప్పగా వర్ణించారని చెప్పారు. ఒక గోవుకు ప్రదక్షిణ చేయడం ద్వారా అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుందన్నారు. సమస్త భూతములకు తల్లిలాంటిది గోవు అని, గోవు మంగళకర దేవత అని వర్ణించారు. సమస్త శుభములు ఇవ్వగలిగినది గోవు మాత్రమే అని, జీవితంలో వృద్ధిలోకి రావాలంటూ ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే గోప్రదక్షిణ విధిగా పాటించాలని సూచించారు.
ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు యుగ పురుషుడు అని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. గోమా త వైభవం ప్రవచన కార్యక్రమంలో టీజీ వెం కటేశ్ దంపతులు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా, దంపతులు పాల్గొన్నారు. వారిని చాగంటి కోటేశ్వర రావు ఘనంగా సత్కరించారు. ముందుగా గోమాతకు పూజచేసి అనం తరం ‘గోవు ప్రాధాన్యత-గోవు సేవావశ్యకత’ అనే పుస్తకం ఆవిష్కరించారు. మొదటి పుస్తకాన్ని టీజీ వెంకటేశ్, భరత్‌లకు చాగంటి అందజేశారు.టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ చాగంటి లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నందునే మనమంతా బాగున్నామని చెప్పారు. ఆయన తమను సన్మానించడం తమ పూర్వజన్మ సుకృతమనిఅన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు కర్నూలుకు రావడం తమ అదృష్టమని అన్నారు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్నా ఆయన సామాన్యుడిలాగే ప్ర యా ణిస్తారని, రాజకీయాల్లో ఎలా ఉండాలో చాగంటి ప్రవచనాల్లో తెలి యజేయాలని కోరారు. ఏపీలోనే అతిపెద్ద గోశాల కర్నూలులో ఉందని అన్నారు. గాయత్రి గోశాలలో 1200కుపైగా గోవులు ఉన్నా యని, గోమాతకు ఎలా పూజచేయాలో పుస్తకరూపంలో తెలియజేయడంతో ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.





