
– రాంపల్లి మల్లికార్జున రావు
పాశ్చాత్య దేశాలలో పర్యటించిన తొలి హిందూ సన్యాసి స్వామివివేకానంద.1893 సెప్టెంబర్ లో జరిగిన ప్రపంచ మతమహాసమ్మేళనం తదుపరి వారు పాశ్చాత్య దేశాలలో పర్యటించి 1897 న భారతదేశానికి తిరిగి వచ్చారు . ఆ సమయంలో కొద్దిరోజులు చేన్నపట్నం లో ఆగారు అక్కడ 1897 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో”మద్రాస్ టైమ్స్” పత్రిక వాళ్ళు స్వామీవివేకానంద తోఇంటర్వ్యూచేశారు .ఆ ఇంటర్వ్యూ లోస్వామి వివేకానంద పాశ్చాత్యదేశాలలో తన అనుభవాలను వివరించారు. ఆ విషయాలు
”నేను ఐరోపా ఖండంలోని జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మొదలైన దేశాలలో పర్యటన చేశాను. ఆ సమయంలో నా పనికి ఇంగ్లాండ్ అమెరికాలే కేంద్రం. ఇంగ్లాండ్ అమెరికాదేశాల ప్రజలకు భారతదేశం నుంచి అక్కడకు వెళ్లిన ప్రజల పట్ల విద్వేషపూరితమైన వ్యవహారం ఉండేది. దానితో ఒక సమయంలో నేను కూడా అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాను . కానీ ప్రపంచంలో భారత జాతి అత్యంత నైతిక విలువలు కలిగిన జాతి . ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన జాతి. ఇక్కడి హిందువులను ప్రపంచ ప్రజలతో పోల్చటము అంటేదైవదూషణ అవుతుంది. చాలామంది నన్ను ద్వేషించారు అక్కడిక్రైస్తవ మిషనరీలు నన్ను ఒక మోసగాడు అని నాకు అనేక మందిభార్యలు ఉన్నారని అనేక మంది పిల్లలు కూడా ఉన్నారని అబద్ధాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఈ క్రైస్తవ మిషనరీల విషయంలో నాకు ఒక స్పష్టత ఉన్నది. వారు వారి మతం పేరుతో ఏమేమి దుర్మార్గాలు చేయగలరో ఆ విషయాలన్నీ చూసిన తర్వాత అవి నా కళ్ళు తెరిపించాయి. ఆ విషయంలో వారు ఎవరు కూడా నాతో పోరాటానికి సిద్ధం కాలేదు. ఇంగ్లాండ్ కు చెందిన ఒక మిషనరీ నా వెనుక నన్ను ద్వేషించడానికి అమెరికా వెళ్లాడు కానీ అమెరికాలో ఆయన చేసిన ప్రచారం ఎవరు నమ్మలేదు నా మీద వాళ్లకు పూర్తి విశ్వాసం ఉండేది నా సత్యమే ఆ మిషనరీ నోరు మూయించింది’’। అవి ఆనాటి పరిస్థితులు.
అది జరిగి ఇప్పటికే 129 సంవత్సరాలు అయింది. భారతదేశము వలస పాలన కోరల నుండి స్వతంత్రం పొంది 80 సంవత్సరాలు అవుతున్నది. ఈ 80 సంవత్సరాల కాలంలో భారతీయులు తమ మేధాశక్తితో శ్రమతో ప్రతిభా సామర్థ్యాలతో ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అయినా పాశ్చాత్య నాగరికత మూలాలతో ఎదుగుతున్న భారతదేశాన్ని గుర్తించటానికి భారతీయ సంస్కృతిక విలువలను అంగీకరించడానికి ప్రపంచం ఇంకా పూర్తిగా సంసిద్ధంగా లేదు అని అనిపిస్తున్నది. 1893 నుండి స్వామివివేకానంద అనుభవం లోనికి వచ్చిన విషయాలు ఇప్పటిపరిస్థితుల తో పోల్చి చూస్తే మన దేశం గురించి బయట దేశాలకు మనపై ఉన్న అభిప్రాయాలు లో పూర్తి మార్పు రాలేదు అని అర్ధమవుతుంది . భారతీయ నాగరికత, భారతదేశం గురించి అపోహలు అభిప్రాయ భేదాలు పూర్తిగా సమసి పోలేదు అవి ఇంకాకొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం శతాబ్ది కార్యక్రమాల సమయంలో సంఘ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ఇంగ్లాండ్ , అమెరికా లలో పర్యటించి అక్కడ ఉన్న వివిధస్థాయిలో పెద్దలతో, ప్రజలతో కలిసి మాట్లాడటం ప్రసంగించడం ద్వారా అక్కడ ప్రజల దగ్గర కు చేరటానికి ఒక మంచి ప్రయత్నంచేసారు. భారతదేశంలో దశాబ్దాలుగా ఉదారవాద మరియు వామపక్ష ఆధిపత్య మీడియా, విద్యావేత్తలు సంఘం గురించి చేస్తున్న అనేక దుష్ప్రచారాలు, రేకెత్తించిన ప్రశ్నలు కారణంగా పాశ్చాత్య దేశాలలోని మేధావులు మరియు విధాన రూపకర్తలు అనేకమందికి సంఘం పట్ల సందేహాలు ఉన్నాయి. సంఘ శతాబ్ది సమయంలో దేశ వ్యాప్తంగా సంఘంపై ప్రజలలో పెరుగుతున్నఆదరణ మొదలైనవి చూస్తూ కూడా సంఘమంటే హిందూఆధిపత్యం, మైనారిటీ వ్యతిరేకము అనేటువంటి ఆలోచనలో పెద్దమార్పు రాలేదు. దత్తా జి వాషింగ్టన్ డిసి లోని ఇన్స్టిట్యూట్లో వారుఅడిగిన ప్రశ్నలు అన్నిటికీ సూటిగా సమాధానం ఇచ్చి సంఘ దృష్టికోణాన్ని చాలా స్పష్టంగా చెప్పటం ఒక ముందు అడుగు అనిచెప్పవచ్చు.
హిందువులు యావత్ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావిస్తారు కాబట్టి హిందువులు జాతి వివక్ష చూపరు . రాష్ట్రీయస్వయంసేవక సంఘం తన కార్య పద్ధతి ద్వారా ప్రజలతో కలుస్తూ ప్రజలను కదిలిస్తూ ఒక పెద్ద ఉద్యమంగా పనిచేస్తున్నది అనిచెప్పటం ఈ రోజున అత్యవసరమైనటువంటి విషయము. పాశ్చాత్య ప్రపంచం తమ కొలమానాలతో భారత్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా భారత్ మరియు హిందుత్వం తాత్వికచింతన పైన అపోహలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి . సంఘం వ్యక్తి నిర్మాణం క్రమశిక్షణ లక్ష్యంగా జరిగే శాఖ కార్యక్రమాలతో పాటు క్షేత్రస్థాయిలో విద్య ఆరోగ్య రక్షణ గ్రామీణ అభివృద్ధి పర్యావరణపరిరక్షణ లాంటి అనేక పనులు చేస్తున్నది . ప్రాకృతిక విపత్తుల సమయాలలో సంఘ స్వయంసేవకులు చేస్తున్న అనేక కార్యక్రమాల్లో వివక్షత అనేది లేకుండా చేస్తున్న సేవలు అందరూ ఆదరిస్తున్నారు . ఈ విషయాలన్నిటిని అక్కడ పెద్దలకు సర్ కార్యవాహ వివరించడంలో చాలావరకు విజయం సాధించారు అని చెప్పవచ్చు. ప్రముఖ యూరోపియన్ మేధోమధన బృందాలతో వ్యాపార వేత్తలతో మరియు ప్రజా ప్రతినిధులతో జరిపిన సంభాషణలో కూడా దత్తాజీ ప్రపంచ సంక్షోభం పరిస్థితుల విషయంలో సంఘ దృష్టి కోణాన్నివివరించి చెప్పారు. కుటుంబాలు తద్వారా సమాజాల నిర్మాణం వరకు ప్రతి స్థాయిలో ఉమ్మడి సార్వత్రిక విలువలతో కూడిన సుస్థిర సమాజాలను నిర్మించాలనే సంఘ భవిష్యత్తు దృష్టిని యునైటెడ్ కింగ్ డమ్ మరియు జర్మనీలలో అన్ని వర్గాల ప్రజలు ఆమోదించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనిశ్చిత పరిస్తితులు యుద్ధాలతోదెబ్బతిన్న ప్రపంచానికి ఆ సవాళ్లు ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు ఈ రెండింటికి సమతుల్యం చేయటానికి ఒక విభిన్నమైన విధానాన్నిఇవాళ ప్రపంచం కోరుతున్నది. పాశ్చాత్య ఆలోచనలతో నిర్మాణమైనవ్యవస్థలు సమస్యల పరిష్కారానికి సరిపోవు, భారత్ తనఅనుభవంతో ఆ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన విశిష్టమైన జ్ఞానాన్ని అందించగల గరికతా మూలాలుఉన్నాయి . ఆధునిక సామర్థ్యం కలిగిన ప్రవాస భారతీయులు ఈ ప్రక్రియలోవారధిగా నిలవగలరు.
స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో గ్లోబల్ సైన్స్ ఇన్నోవేషన్ ఫోరంనిర్వహించిన THRIVE 2026 సదస్సు సందర్భంగా అత్యంతఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈరోజు ప్రపంచంలో ఆవిష్కృతం అవుతున్న సాంకేతిక విషయాలు మానవ జీవితంపై ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అని ఆలోచించడం అవసరం ఉంది. నీతి, పర్యావరణం ఆర్థికవ్యవస్థలకు ఈ విషయంలో ఒక కీలక పాత్ర ఉంది అని దత్తాజి చెప్పారు. విజ్ఞాన శాస్త్రానికి ఆధ్యాత్మికతకు మధ్య భారతదేశం ఒకఉమ్మడి వేదికను కనుగొన్నది పాశ్చాత్య దేశాల వద్ద సాంకేతికత ఇప్పుడు చైతన్యంపై చర్చిస్తున్నది. అయితే భారతదేశం నాగరికతనుఆధ్యాత్మికతను ఒక విజ్ఞాన శాస్త్రంగా చూస్తున్నది. ఈ అంశాలపైచర్చలు ఇరుపక్షాలకు ప్రయోజనకరంగా ఉంటాయి ఒకరికొకరు అర్థంచేసుకోవడానికి సంభాషనే ఏకైక మార్గం మరియు సత్యాన్వేషణ లోఅర్థవంతమైన చర్చ సారాంశమైన శాస్త్రార్ధాన్ని హిందువులువిశ్వసిస్తారు . సంఘ తరఫున ఈ విషయాలన్నీదత్తజీ అక్కడివాళ్ళకు తెలియజేశారు. దౌత్యపరమైన వ్యూహాత్మకైనా విషయాలకు అతీతంగా ప్రజల మధ్య అవగాహనను పెంపొందించడానికి ఒకకొత్త మార్గాన్ని వికసింప చేయవలసిన అవసరం ఉంది. ఇట్లా అనేక విషయాలు అక్కడ వాళ్లకు అర్థం చేయించారు.





