
523views
న్యూఢిల్లీ: గత 15 రోజుల్లో అనేక మంది భారత జాలర్లు పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారు. చేపల వేటకు వెళ్లిన జాలర్లను పాకిస్తాన్ అపహరిస్తోందని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అపహరణకు గురైన ఓ జాలర్ల బృందం కూడా చివరగా ఇదే విషయాన్ని వెల్లడించినట్టు ఇటీవల అధికారులు తెలిపారు.
ఇటీవల కాలంలో పాకిస్తాన్ 50కుపైగా భారత జాలర్లను అపహరించింది. అంతకుముందు.. తమ చెరలో ఉన్న కొంతమంది భారత జాలర్లను మానవతా దృక్పథంతో విడుదల చేస్తున్నామని పేర్కొంటూ పాక్ వారిని విడుదల చేసింది. కానీ, అది జరిగిన కొన్ని రోజులకే మళ్లీ జాలర్ల అపహరణలు మొదలు కావడం గమనార్హం.





