News

అమెరికా, ఐరోపా దేశాల కంటే వేగంగా భారత ఆర్థిక వృద్ధి

510views
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: కరోనా కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పటికీ అంతే వేగంగా పైకి వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, ఐరోపా దేశాల కంటే మన ఆర్థిక వృద్ధి వేగంగా సాగుతున్నట్టు వెల్లడించారు. 2022-23 బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చకు ఆమె గురువారం రాత్రి సుమారు రెండు గంటల పాటు సమాధానం ఇచ్చారు.

2021, 2022, 2023ల్లో అమెరికా వరుసగా 5.6%, 4%, 2.6%; భారత్‌ వరుసగా 9%, 9%, 7.1% వృద్ధి రేటు నమోదు చేస్తాయని అంచనావేస్తున్నాం. మన వృద్ధిరేటు ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది అవుతుంది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పతనం మన దగ్గర ఎక్కువ నమోదైనప్పటికీ అందరికంటే వేగంగా పుంజుకుంటున్నాం. ప్రజలు కట్టిన పన్నులను మూలధన వ్యయంగా ఖర్చు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని వివ‌రించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి