News

అమెరికాలో గాంధీ కాంస్య విగ్రహం ధ్వంసం

349views
  • తీవ్రంగా ఖండించిన భారత్

న్యూయార్క్: అమెరికాలో గాంధీ కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. న్యూయార్క్​లో జరిగిన ఈ ఘటనను అక్కడ నివసిస్తున్న భారతీయులతో పాటు భారత కాన్సులేట్​ జనరల్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. గాంధీ 117వ జయంతిని పురస్కరించుకుని గాంధీ స్మారక అంతర్జాతీయ ఫౌండేషన్​ దీనిని బహూకరించింది.

ఈ విగ్రహాన్ని న్యూయార్క్​ యూనియన్​ స్కేర్​లో 1986 అక్టోబరు 2న ఏర్పాటు చేశారు. దీనిని కొన్ని కారణాలతో 2001లో తొలగించి.. 2002లో మళ్లీ పునరుద్ధరించారు. అమెరికాలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలో ఇటువంటి ఘటనలు వెలుగుచూశాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి