-
సంస్కృతి, విద్యుత్‌శాఖా మంత్రి సునీల్‌కుమార్
కర్ణాటక: దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనిది కొత్తగా కళాశాలలో హిజాబ్‌తో తరగతులకు బాలికలు రావడం ప్రాథమిక హక్కుగా మాట్లాడే సిద్దరామయ్య మహిళను మసీదులలోకి పంపగలరా అంటూ కర్ణాటక సంస్కృతి, విద్యుత్‌శాఖా మంత్రి సునీల్‌కుమార్ ప్రశ్నించారు. హిజాబ్ పేరుతో కొందరు విద్యార్థినులను ముందుకు పంపి అరాచకం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు.
హిజాబ్ ప్రాథమిక హక్కు అనే ప్రతిపక్షనేత సిద్దరామయ్య అదే మతానికి చెందిన మహిళలను మసీదులలోకి తీసుకెళ్లగలరా? అని ప్రశ్నించారు. పాఠశాల ప్రాంగణం దాకా హిజాబ్‌తో పాటు బురఖాతోను రావచ్చునని కానీ తరగతి గదికి కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలోను యూనిఫాం విధానం ఉందని ఆయన గుర్తు చేశారు.
విద్యార్థులందరూ ఒకే విధమైన యూనీఫాం ధరించిడం అందరూ సమానమనే సందేశానికనేది గుర్తుంచుకోవాలని ఆయన హితవు చెప్పారు. త్రిపుల్ తలాక్ ద్వారా మైనార్టీ మహిళలకు భద్రత కల్పించింది ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని పేర్కొన్నారు. ఎస్‌డీపీఐ, యూటీ ఖాదర్ మాటలు విని విమర్శలు చేయరాదని హితవు చెప్పారు.
కాగా, మైసూరు ఎంపీ ప్రతాపసింహ మీడియాతో మాట్లాడుతూ హిజాబ్‌ను సిద్దరామయ్య సమర్థించడం చూస్తుంటే రానున్న ఎన్నికల నాటికి సిద్ద రహీమ్‌య్యగా పేరు మార్చుకొంటారని ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసమే సిద్దరామయ్య హిజాబ్‌ను సమర్థించారని హితవు చెప్పారు. ఆరుగురు విద్యార్థులు హిజాబ్ పేరుతో 600 మంది విద్యార్థులను ఇబ్బంది పెట్టడం గురించి ఎందుకు సిద్దరామయ్య స్పందించరని ఆయన ప్రశ్నించారు.
Source: Nijamtoday