News

అమెరికాలో పాక్ రాయబారిగా జిహాదీ నియామకం

328views
  • తీవ్రంగా ఖండించిన భారతీయ అమెరికన్లు

  • నియామకాన్ని తిరస్కరించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు విజ్ఞప్తి

న్యూఢిల్లీ: అమెరికాలో పాక్‌ రాయబారిగా మసూద్‌ ఖాన్‌ నియామకాన్ని తిరస్కరించాలని భారతీయ అమెరికన్ల ఉన్నత స్థాయి బృందం అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేసింది. మసూద్‌ ఖాన్‌ ఉగ్రవాద గ్రూపుల సానుభూతిపరుడిగా పేర్కొంది.

పాక్ దౌత్యవేత్త మసూద్ ఖాన్ ఉగ్రవాద గ్రూపులకు సానుభూతిపరుడని, మద్దతుదారుడని భారత ఉన్నతస్థాయి బృందం ఆరోపించింది.
లేడీ అల్‌ఖైదా అఫియా సిద్ధిఖీ, ఉగ్రవాద గ్రూపులు హిజ్బుల్‌ ముజాహిదీన్‌, హర్కత్‌ ఉల్‌ ముజాహిదీన్‌, జమాతే ఇస్లామీ పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించినట్టు భారత ఉన్నతస్థాయి బృందం ఆందోళన వ్యక్తం చేసింది.

మసూద్ ఖాన్​ను దైత్యవేత్తగా నియమించడం వల్ల టెర్రరిస్టు సంస్థలు అమెరికాలోని ఇన్​స్టిట్యూట్​లలోకి ప్రవేశం పొందే ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడింది. అఫ్గానిస్థాన్​పై అమెరికాకు ఉన్న వైఖరి పైనా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది.

2019లో మసూద్ ఖాన్ అంతర్జాతీయ ఉగ్రవాది, హర్కత్-ఉల్- ముజాయిద్దీన్​(హెచ్​యూఎం)వ్యవస్థాపకుడు ఫజలూర్ రెహ్మాన్ ఖలీల్​తో స్టేజీ పంచుకున్నాడని ఆరోపించింది. ఆగస్టు 21, 2015 వరకు మసూద్​ఖాన్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) అధ్యక్షుడిగా ఉన్నాడని పేర్కొంది భారత ఉన్నతస్థాయి బృందం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి