
489views
-
తేల్చిన అంతర్జాతీయ సర్వే
న్యూఢిల్లీ: 2020 గల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో చైనాకు భారీ ప్రాణ నష్టం జరిగిందని ఆస్ట్రేలియాకు చెందిన ఓ పరిశోధనాత్మక వార్తాపత్రిక పేర్కొంది. కానీ, చైనా తమ వైపు తక్కువ ప్రాణ నష్టం జరిగినట్టుగా వెల్లడించిందని తెలిపింది. చైనాకు చెందిన సోషల్ మీడియా పరిశోధకులు, తాము కలిసి జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని స్పష్టం చేసింది.
ఈ ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు చనిపోయారని నివేదికలో వెల్లడించింది. కానీ, చైనా తమ వైపు తక్కువ ప్రాణ నష్టం జరిగినట్టుగా గతేడాది ఫిబ్రవరిలో నివేదించింది. అయితే, చీకట్లో సబ్‌జీరో నది దాటుతూ చనిపోయిన చైనా సైనికుల సంఖ్య అధికారిక లెక్కల కంటే 9 రెట్లు ఎక్కువగా ఉంటుందని తాము జరిపిన పరిశోధనలో వెల్లడైందని తెలిపింది.





