News

నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాల‌యానికి భ‌ద్ర‌త పొడిగింపు

444views
  • ఉగ్ర నీడ దృష్ట్యా డ్రోన్లపై నిషేధం

నాగపూర్: నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ‌(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయానికి ఉన్న భ‌ద్ర‌త‌ను పొడిగించారు. అంతేకాకుండా సంఘ‌ ఇతర ముఖ్యమైన కార్యాలయాలపై డ్రోన్‌లు ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ మేరకు నాగపూర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశ్వతీ దోర్జే ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిషేధాన్ని మంగళవారం, మార్చి 31 వరకు పొడిగించినట్టు అధికారి తెలిపారు. నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలో సంఘ బిల్డింగ్ రోడ్‌లో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ భవన్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మూడు కిలోమీట‌ర్ల ప‌రిధి వ‌ర‌కు నిషేధం ఉంటుంద‌ని, డ్రోన్‌లు, రిమోట్ కంట్రోల్డ్, ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్‌లు, పారా-గ్లైడర్‌లు, ఏరో మోడల్‌లు, పారాచూట్ సంబంధిత కార్యకలాపాలు అనుమతించమని పోలీసులు పేర్కొన్నారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, హెడ్ క్వార్టర్ మెయింటెనెన్స్ కమాండ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వాయుసేన నగర్, మహల్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, స్పెషల్ బ్రాంచ్ రాతపూర్వక అనుమతితో డ్రోన్లను ఎగురవేయవచ్చు.

నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేస్తామని నాగపూర్ డీసీపీ హెచ్చరించారు. నాగపూర్‌లోని కొన్ని సున్నితమైన ప్రదేశాలపై పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్ (జెఈఎం) ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారని సమాచారం అందడంతో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు, ఆ చుట్టుపక్కల నాగ్‌పూర్ పోలీసులు నెలరోజుల నుండి భద్రతను పెంచిన విష‌యం విదిత‌మే.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి