News

సమాజ్ వాదీకి మళ్ళీ షాక్ : బీజేపీలోకి ములాయం సింగ్ సన్నిహితుడు

376views

రికొద్ది వారాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ ‌వాదీ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) మాజీ నాయకుడు శివ కుమార్ బెరియా 31/1/2022, సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

శివకుమార్ బెరియా సమాజ్ ‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఎస్పీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇది ఇలావుండగా, మరోవైపు ఎస్పీ ఎమ్మెల్సీ రమేష్ మిశ్రా కూడా బీజేపీలో చేరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.