News

కిషన్ భర్వాద్ హత్య కేసులో మౌలానా అరెస్ట్

693views

న్యూఢిల్లీ: కిష‌న్ భ‌ర్వాద్ హ‌త్య కేసులో మౌలానా(ముస్లిం మత గురువు)ని గుజ‌రాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది. శ్రీకృష్ణుడిని అత్యంత శక్తివంతమైన దేవుడిగా ప్రకటించే వీడియోను సోషల్ మీడియాలో కిష‌న్ భ‌ర్వాద్ అప్‌లోడ్ చేశాడు. దీనిని స‌హించ‌లేని ఇస్లాంవాదులు బైక్‌పై వచ్చి కిషన్ భర్వాద్‌ను కాల్చి చంపారు. ఈ సంఘ‌ట‌న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లా, ధాన్‌ధూకా నగరంలో జ‌రిగింది. ఈ హ‌త్య‌తో ప్ర‌మేయం ఉన్న మౌలానా ఖ‌మ‌ర్ గ‌ని ఉస్మానీని ఆదివారం న్యూఢిల్లీలో అరెస్టు చేశారు.

నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా, ట్రాన్సిట్ రిమాండ్‌కు పంపారు. గుజరాత్‌లోని సంబంధిత కోర్టులో కూడా హాజరుపరచనున్నారు. ఇంటరాగేషన్ కోసం ఏటీఎస్ పది రోజుల రిమాండ్ కోరే అవకాశం ఉంది. జనవరి 25న కిషన్ హత్య జరగగా, ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో అహ్మదాబాద్‌కు చెందిన మౌలానా అయ్యూబ్ కూడా ఉన్నాడు.

అతను కిషన్‌ను కాల్చి చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని సేకరించడంలో సహాయం చేశాడు. మౌలానా ఉస్మానీకి తహ్రీక్ ఫరోగ్-ఎ-ఇస్లామ్‌తో సంబంధం ఉందని గుజరాత్ ఏటీఎస్ పేర్కొంది. దాని వెబ్‌సైట్ ప్రకారం, ఈ ఇస్లామిక్ సంస్థ ఢిల్లీలోని ఓఖ్లాలోని జకీర్ నగర్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి