-
పతాకంతో వీధుల్లో యువత సంబరాలు
లాల్ చౌక్: జమ్మూ కశ్మీర్ శ్రీనగర్‌లోని లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద బుధవారం భారత త్రివర్ణ పతాకాన్ని స్థానిక కాశ్మీరీ ముస్లింలు ఎగురవేశారు. లాల్ చౌక్ లో 73వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు. కశ్మీర్‌లోని పిల్లలు-యువత గుప్కర్ రోడ్‌లో 30 మీటర్ల పొడవైన భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. దానితో నగరంలో నడిచారు.
అబ్దుల్లా కుటుంబం, ముఫ్తీ కుటుంబాల నివాసాలు శ్రీనగర్‌లోని గుప్కర్ రోడ్‌లో ఉన్నాయి. నగరంలోని యువకులు ఈ రహదారిపై 30 మీటర్ల పొడవైన భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. వారి నివాసాల ముందు రహదారి వెంట తీసుకెళ్లారు. ఏబీవీపీ స్థానిక సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాల్ చౌక్ వద్ద జెండాను న్యాయవాది సాజిద్ యూసుఫ్ షా, సామాజిక-రాజకీయ కార్యకర్త సాహిల్ బషీర్ భట్ ఎగురవేశారు. స్థానిక కాశ్మీరీ ప్రజలు గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఆనందంగా నిర్వహించారు. ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రాయోజిత వేర్పాటువాదానికి ముగింపు పలికింది.
Historic day in Kashmir. Youth activists who are local Kashmiri Muslims hoist Indian tricolour at the Ghantaghar of Lalchowk in Srinagar, Kashmir on the occasion of 73rd #RepublicDayIndia ?? pic.twitter.com/fDH1Q7xzWi
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 26, 2022
జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్ శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లోని క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చిత్రాలను పంచుకున్నారు. స్థానిక కశ్మీరీ ముస్లింలు ధైర్యంగా, సాహసోపేతమైన చర్య తీసుకున్నారని అన్నారు. అందుకు సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. కొందరు స్థానిక రాజకీయ నాయకుల కారణంగా గతంలో లాల్ చౌక్ వద్ద భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించిన వారిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేసేవారు. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. భారతదేశంలోని ఇతర నగరాల్లో మాదిరిగానే శ్రీనగర్‌లో రిపబ్లిక్ డేను ఆస్వాదిస్తున్నారని ఆదిత్య రాజ్ కౌల్ తెలిపారు.
కశ్మీర్‌లో ఎవరూ త్రివర్ణ పతాకాన్ని పట్టుకోరని చెప్పిన రాష్ట్ర పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి కశ్మీర్‌లో రిపబ్లిక్ డే నాడు చోటు చేసుకున్న సంఘటనలు అతి పెద్ద దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు. 2020లో ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ జెండా, ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కశ్మీర్ సొంత జెండాను తిరిగి ఇచ్చే వరకు కశ్మీర్‌లో ఎవరూ జాతీయ జెండాను ఎగురవేయరని చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేయడం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏని సవాలు చేయడం ద్వారా కశ్మీరీలకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కులను కేంద్ర ప్రభుత్వం దోచుకుందని అన్నారు. స్థానిక కశ్మీరీలు 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలకు హాజరవ్వగా.. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పూర్తి నిశ్శబ్దం పాటించారు. అదే సమయంలో ఒమర్ అబ్దుల్లా భారత రాజ్యాంగ ప్రవేశికను ట్వీట్ చేశారు.
Source: NationalistHub