మణిపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ నాలుగు రోజుల బైఠక్ కోసం శుక్రవారం (జనవరి 21) మణిపూర్ రాజధానికి చేరుకున్నారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని హరౌలో యూత్ మోడరన్ క్లబ్(హరోరు)కు చెందిన స్వయం సేవకులు, స్థానికులు భాగవత్ జీకి ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర పర్యటన సందర్భంగా, డాక్టర్ భాగవత్ హరోరూలోని రాజశ్రీ భాగ్యచంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో స్వయం సేవకులతోపాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కీలక బైఠక్‌ల్లో పాల్గొననున్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. తన పర్యటనలో భాగంగా, డాక్టర్ భాగవత్ కాలాపానీలో అన్‌సంగ్ ఆంగ్లో-మణిపురి వార్ హీరోస్ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేస్తారు. కాలాపానీకి బహిష్కరించబడిన ఆంగ్లో-మణిపూర్ యుద్ధ వీరుల కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు.
Source: Organiser