News

శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం

660views
  • ఉగ్ర దుశ్చర్యగా అనుమానం

శబరిమల: శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. అయ్యప్ప ఆలయ మార్గంలోని పెన్​ఘాట్ వంతెన కింద ఆరు జిలెటిన్ స్టిక్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబు స్క్వాడ్ సాయంతో సోదాలు చేపట్టారు. ఇదే మార్గంలో స్వామివారికి బంగారు ఆభరణాలను తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో తిరువాభరణం పాత్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పీజీ శశికుమార వర్మ, జనరల్ సెక్రటరీ ప్రసాద్ కుజిక్కల ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి