News

కాశ్మీర్‌లో పురాతన హిందూ ఆలయం దగ్ధం!

501views

కాశ్మీర్‌: కాశ్మీర్‌లో పురాతన హిందూ దేవాలయాన్ని దుండగులు మళ్ళీ తగులబెట్టారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లా దేవ్‌సర్‌ పట్టణానికి సమీపంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న వేల ఏళ్ళ నాటి మాతా త్రిపూర్‌ సుందరి ఆలయం జనవరి 13 అర్ధరాత్రి త‌గ‌ల‌బ‌డింది. ఇదే ఆలయాన్ని మూడు దశాబ్దాల క్రితం మతపిచ్చోళ్ళు నిప్పు పెట్టారు. ఆల‌యాన్నిఇటీవల హిందూ సంఘాలు పునర్నిర్మించాయి.

పూజా మందిరంలో దియాను తగులబెట్టడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందన్న పోలీసుల సిద్ధాంతాన్ని పూర్తిగా తోసిపుచ్చుతూ, సమగ్ర విచారణ జరిపించాలని వివిధ హిందూ సంస్థల సభ్యులు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా జమ్మూ ప్రెస్‌ క్లబ్‌ ముందు నిరసన చేపట్టారు.

‘మాతా త్రిపూర్‌ సుందరి(దేవ్‌సర్‌) ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు… ఆలయంలో హారతి ఉంచడం వల్ల ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం సంభవించిందని ముందస్తు విచారణ వెల్లడిస్తోంది… పుకార్లను పట్టించుకోవద్దని ప్రజలను అభ్యర్థిస్తున్నాము’ అని కుల్గామ్‌ జిల్లా పోలీసులు ట్వీట్‌ చేశారు.

ఇంత చలిలో అర్ధరాత్రి మంటలు ఎలా చెలరేగాయని? భక్తులు సమర్పించే కర్టెన్లు, దారాలు లేనప్పుడు దేవస్థానంగా భావించే చెట్టు ఎలా దగ్ధమైందని భక్తులు ప్ర‌శ్నిస్తున్నారు.

‘దియాలు అలాంటి మంటలను కలిగించడం సాధ్యం కాదు, అది కూడా, ఈ రోజుల్లో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించనప్పుడు … ఒక దియా తెల్లవారుజామున 1 గంటలకు మంటలను ఎలా కలిగిస్తుంది’ అని దేవ్‌సర్‌ నివాసి సునీతా ధర్‌ ప్రశ్నించారు. ఆలయం మూసి ఉన్నందున హారతి నిర్వహించడం లేదని స్థానికులు తెలిపారు. ‘స్థానిక అధికారులు దర్యాప్తు చేయకుండా త్వరితగతిన నిర్ధారణలకు రావడం మరింత బాధ కలిగిస్తోంది’ అని బిజెపి మాజీ శాసనసభ్యుడు సురీందర్‌ అంబర్దార్‌ అన్నారు.

పోలీసులు మరో ‘వివరణ’ కూడా ఇచ్చారు.. ఆర్మీ బృందం అర్ధరాత్రి ఆలయాన్ని శుభ్రపరిచిందని, శుభ్రపరిచే సమయంలో మంటలు చెలరేగి ఉండవచ్చని వారు చెప్పారు. అయితే, దీనిపై సైన్యం ఇంకా స్పందించలేదు.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి