News

SSF ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంత్యుత్సవం

108views

ర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణం నందు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. వక్త సమరసత సేవా ఫౌండేషన్ మండల సహ కన్వీనర్ శ్రీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మన దేశం యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిన, మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. యువకులు, విద్యార్థులు స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలలో నడవాలని అన్నారు.

ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన భక్త కన్నప్ప గురుకులం ఆవాస ప్రముఖ్ శ్రీ రామకృష్ణ మాట్లాడుతూ, సుసంపన్నంగా విరాజిల్లవలసిన మన దేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులలో, భారతీయులంతా నిరాశ నిస్పృహల చీకటిలో బతుకుతున్న కాలంలో స్వామి వివేకానంద ఉద్భవించి జాతికి మార్గదర్శనం చేశారని, ఆయన భారతదేశంలోని యువతకు రోల్ మోడల్ అని పేర్కొన్నారు. మనమంతా స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, వారి అడుగుజాడలలో నడుస్తూ సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తులుగా తయారు కావాలని శ్రీ రామకృష్ణ అన్నారు. కార్యక్రమంలో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.