News

నెల్లూరు : వివేకానంద జయంతి సందర్భంగా ఆరెస్సెస్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు

142views

దేశమంతటా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకునే స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని 12/01/2022న నెల్లూరు నగరంలోని AC నగర్, ఎం ఎస్ ఎం స్కూలు ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో11 కళాశాల జట్లు, నాలుగు బాల శ్రేణి జట్లు పాల్గొన్నాయి. మొత్తం 150 మంది క్రీడాకారులు ఈ కబడ్డీ పోటీలలో పాల్గొన్నారు. పోటీల అనంతరం జరిగిన సభలో ఆరెస్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ పుట్టా శేషు పాల్గొని స్వామి వివేకానంద జీవిత విశేషాలను, వారి బోధనలను గూర్చి వివరించారు. అనంతరం పెద్దలు విజేతలకు బహుమతులు అందజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.