News

నిరుపేద మరాఠీ కుటుంబానికి బొంతలు కుట్టే టైలరింగ్ మిషన్ వితరణ

564views

ఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి, సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో…. అఖిల భారత సంచార జాతుల ప్రముఖ్ గౌ..శ్రీ దుర్గదాస్ జీ గారి రెండు రోజుల పర్యటన లో భాగంగా ఈ రోజు ఒంగోలు దగ్గరలోని టంగుటూరు, కొండెపి గ్రామాల్లోని సంచారజాతుల కుటుంబాలను సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా పని చేయటానికి కార్యకర్తలకు కొన్ని సూచనలు చేశారు.ఇందులో భాగంగా సంచార జాతి (30మంది కుటుంబ సభ్యులు కలిగిన నిరుపేద ఆర్య మరాఠీ) కుటుంబానికి బొంతలు కుట్టే టైలరింగ్ మిషన్ ను దుర్గాదాస్ జీ చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో AIDNTDCAR. AIDNTDC రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకట్, RSSవిభాగ్ కార్యవహ శ్రీ వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.