News

కుళ్ళిన బంగాళదుంప‌లే అక్క‌డి హిందువులకు గ‌తి!

1.3kviews
  • బంగ్లాదేశ్‌లోని దురాగ‌తాల‌ను బయటపెట్టిన సుమిత్రా దే

ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువుల జీవితాలపై వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో క్రమం తప్పకుండా కనిపించే విజువల్స్, డాక్యుమెంటరీలు హృదయ విదారకంగా మాత్రమే కాకుండా ఆందోళనకు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లోని డీబీసీ న్యూస్ ఛానెల్ ఇటీవల విడుద‌ల చేసిన డాక్యుమెంటరీ ఎన్నో విషాదాలు బ‌య‌ట‌పెట్టింది. ముగ్గురు యువతులు, వృద్ధ అత్త క‌లిగిన‌ ఓ హిందూ కుటుంబానికి సొంత భూమి ఉన్నప్పటికీ నిరాశ్రయులైంది. ఫ‌లితంగా క‌డుపు నిండా తిన‌డానికి తిండి కూడా దొర‌క‌డం లేదు.

చుట్టుముట్టిన అనారోగ్య స‌మ‌స్య‌లు

తన కష్టాలకు అంతం లేదని సుమిత్రా దే క‌న్నీళ్ళ‌ప‌ర్యంత‌మ‌య్యారు. ఆమెకు రాత్రి నిద్ర కూడా పట్టదు. ముడతలు పడిన, నిస్సహాయమైన ఆమె క‌ళ్ళ‌ల్లోంచి క‌న్నీళ్ళు వ‌స్తున్నాయి. ఆమె సోదరుడు, సోదరుడి భార్య 2009, 2013లో ముగ్గురు చిన్నారులను విడిచిపెట్టి మరణించారు. సుమిత్రా దేవి, ఆమె ఇతర సోదరుడు ఈ ముగ్గురు మేనకోడళ్లను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు.

వారిలో ఎవరికీ వివాహం కాలేదు. దురదృష్టవశాత్తు, కూలి పనులు చేస్తూ ఇంటికి ఏకైక జీవనోపాధిగా ఉన్న సుమిత్రా దేవి సోదరుడి కూడా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. చికిత్స లేకపోవడంతో మరణించాడు. సుమిత్రా దేవి ఇప్పుడు చదువుకుంటున్న ముగ్గురు మేనకోడళ్ళ‌తో మిగిలిపోయింది. ఈ ముగ్గురు మేనకోడళ్లలో ఒకరు తన చదువును కొనసాగిస్తూనే ప్రభుత్వ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. 8,000 బంగ్లాదేశ్ టాకాను సంపాదిస్తున్నారు. నలుగురితో కూడిన ఈ కుటుంబానికి ఇప్పుడిదే ప్ర‌ధాన, ఏకైక ఆదాయ మార్గం.

ఆడపిల్లలకు మంచి ఆహారం పెట్ట‌లేక‌పోతున్నా…

ఆడపిల్లలకు మంచి ఆహారం వండి పెట్టలేకపోతున్నానని సుమిత్రా దేవి విలపిస్తోంది. ఆమె మార్కెట్‌కి వెళ్లి ఆకులు, బంగాళాదుంపలు వంటి కుళ్ళిన కూరగాయలను తీసుకువ‌స్తుంది. ఇవి ఆమెకు తక్కువ ధరకు ల‌భిస్తాయి. వాటిని వండి అమ్మాయిలకు పెడుతుంది. తను పోయిన తర్వాత ఈ అమ్మాయిల పరిస్థితి ఏమవుతుందోనని భయపడుతోంది. తెలియనిత‌నం వ‌ల్ల ఆమెకు వృద్ధాప్య పింఛను రావ‌డం లేదు.

సొంతిల్లు, భూమి ఉంది…

అయితే, వారి వేదనలు పైవాటికే పరిమితం కాలేదు. కుటుంబానికి సొంత ఇల్లు, భూమి ఉంది. అయితే, తమ భూమికి దగ్గర్లోనే పెద్ద ఎత్తున ప్రాజెక్టు వచ్చి ఈ కుటుంబానికి చెందిన భూమిని క్లెయిమ్ చేసిందని ఓ బాలిక ఆరోపించింది. జరీనా సిక్దర్ గేట్ పేరుతో భారీ కంపెనీను నిర్మించినట్టు ఆ బాలిక చెప్పింది. వీరి భూమిని లాక్కుని ప్రాజెక్ట్‌కి రహదారిని నిర్మించారు. అంతేకాదు… ఆ హిందూ కుటుంబాన్ని వారి సొంత ఇంటి నుండి గెంటేశారు.

సొంత‌ ఇల్లు ఉన్నప్పటికీ, ఈ ముగ్గురు బాలికలు, వారి వృద్ధాప్య అత్తతో పాటు, అద్దెకు తీసుకున్న శిథిలావ‌స్థ‌లో ఉన్న డబ్బా గుడిసెలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ లేదు. దీంతో నిత్యం బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. “మాకు మా సొంత‌ ఇల్లు ఉన్న‌ప్ప‌టికీ వేరొకరి స్థలంలో నివసించవలసి వస్తుంది” అని వృద్ధురాలు సుమిత్రా క‌న్నీరుమున్నీరైంది.

పురుషుల నుంచి వేధింపులు

తమ ఇంటి ప‌క్క‌నుంచి వెళుతున్న పురుషులు తమను ఎలా వేధిస్తున్నారో వారిలో ఒక బాలిక చెప్పింది. ఇంతకు ముందు మామయ్య బ‌తికున్నప్పుడు వాళ్ళ జీవితం కాస్త మెరుగ్గా ఉండేది. కానీ, ఇప్పుడు వారికి ఒక చెల్లెలు ఇంటికి తెచ్చిన కొద్దిపాటి ఆదాయం మాత్రమే దిక్కు!

ఆల‌యాలు, హిందువుల‌ ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ర‌వు

దేవాలయ భూములతో సహా హిందువుల భూములను లాక్కునే వార్తలు నేటి బంగ్లాదేశ్ నుండి క్రమం తప్పకుండా వెలువడుతున్నాయి. చాలా సందర్భాలలో ముస్లింలు భూమిని లాక్కుంటున్నారు. అనేక సందర్భాల్లో, భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప‌లుకుబ‌డి ఉన్న వారే అధికం. దీంతో హిందువులే ల‌క్ష్యంగా మారిపోతున్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువుల భవిష్యత్‌ ప్రమాదకరంగా, నిరంతర ముప్పులో ఉంది.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి