News

దేశ భక్తులకు ఏమిటీ శిక్ష? అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఇండియాలో ఉందా పాకిస్థాన్లో ఉందా?”

357views

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో రేపు జరుగ బోయే రిపబ్లిక్ దినోత్సవ వేడుకలలో భాగంగా అక్కడి విద్యార్ధులు ఈరోజు నిర్వహించిన బైక్ ర్యాలీపై యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్ధులకు షోకాజ్ నోటీసులు జారీ చెయ్యడం వివాదాస్పదమవుతోంది. సంఘటన పూర్వాపరాలలోకి వెళితే రేపటి రిపబ్లిక్ దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ రోజు విద్యార్ధులు యూనివర్సిటీ ప్రాంగణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విషయం తెలిసుకున్న యాజమాన్యం ర్యాలీలో పాల్గొన్న విద్యార్ధులను ర్యాలీలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చిందో వివరణ కోరుతూ విద్యార్ధులకు షో కాజ్ నోటీసులు జారీ చేసింది.

దీనిపై విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మన దేశంలో దేశ భక్తిని ప్రకటించుకోవడం నేరమా? దేశ భక్తులకు ఏమిటీ శిక్ష? అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఇండియాలో ఉందా పాకిస్థాన్లో ఉందా?” అని ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ ఈ అంశంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని, దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.