News

నాసిక్‌ టీసీఎస్‌ క్యాంపస్‌లో వేధింపులపై ఎన్‌సీడబ్ల్యూ నివేదిక

5views

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టీసీఎస్‌ క్యాంపస్‌లో లైంగిక వేధింపులు జరిగాయని, మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చారని, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం కోసం తీసుకువచ్చిన పోష్‌ చట్టాన్ని పాటించలేదని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) తేల్చింది. పలువురు మహిళా ఉద్యోగులు చేసిన ఆరోపణల నేపథ్యంలో టీసీఎస్‌ నాసిక్‌ క్యాంపస్‌ నుంచి వచ్చిన ఫిర్యాదులను తాము సుమోటోగా పరిశీలనలోకి తీసుకున్నామని కమిషన్‌ వెల్లడించింది. ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ విజయా రహాట్కర్‌ ఆదేశాల మేరకు బాంబే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సాధనా జాదవ్, హరియాణా మాజీ డీజీపీ బి.కె.సిన్హా, సుప్రీంకోర్టు న్యాయవాది మోనికా అరోడా, ఎన్‌సీడబ్ల్యూ సీనియర్‌ సమన్వయకర్త లీలాబతిలతో కూడిన కమిటీ గత నెల 18, 19 తేదీల్లో నాసిక్‌లోని టీసీఎస్‌ క్యాంపస్‌ను సందర్శించి 50 పేజీల నివేదికను తయారుచేసింది. దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు సమర్పించింది. నాసిక్‌లోని టీసీఎస్‌ కార్యాలయాన్ని నిందితులు తమ అధీనంలోకి తీసుకున్నారని, వారు యువతులను, బలహీన మహిళా ఉద్యోగులను లైంగికంగా, మానసికంగా వేధించారని అందులో పేర్కొంది.