
సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నియమించిన సరి కొత్త బెంచ్ ఈ నెల [జనవరి 2019] 29 నుంచి విచారించనుంది. 25/1/2019 శుక్రవారం ప్రధాన న్యాయ మూర్తి రంజన్ గోగోయ్ 5గురు సభ్యుల ధర్మాసనానికి ఈ కేసును అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. వారు జస్టిస్ ఎస్ ఏ బొబ్డే, జస్టిస్ డీ వై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ ఏ నజీర్ కాగా స్వయంగా ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ గోగోయ్ కూడా ఇందులో సభ్యుడిగా వుండడం గమనార్హం. ఈ నెల 29 నుంచి కేసు విచారణ చేపట్ట బోతున్నట్టు అయోధ్య కేసులోని వివిధ పక్షాలకు ఐదుగురు సభ్యుల సంతకాలతో కూడిన నోటీసులను పంపించారు. ఈ కేసులో రామలాలా విరాజమాన్, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డు మూడూ ప్రధాన వైరి పక్షాలుగా వున్నా విషయం తెలిసిందే.
30 సెప్టెంబర్ 2010న జస్టిస్ అగర్వాల్, జస్టిస్ డి. వి. శర్మ, జస్టిస్ సిబగతుల్లా ఖాన్ లతో కూడిన లక్నో ధర్మాసనం రామజన్మ భూమి వివాదాస్పద భూభాగంలో మందిర అవశేషాలు వున్నాయని అంగీకరిస్తూ మధ్య గుమ్మటం క్రింది భాగాన్ని రాంలాలాకు కేటాయించి, మిగిలిన భూభాగాన్ని రాంలాలా విరాజమాన్ కు, నిర్మోహి అఖాడాకు, సున్ని వక్ఫ్ బోర్డుకు ఒక్కొక్కరికి 1/3 వ వంతు భూభాగాన్ని కేటాయిస్తూ ప్రకటించిన తీర్పును సవాలు చేస్తూ మూడు పక్షాలూ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా సాగదీయబడిన కేసు నేటికైనా విచారణకు రావడంతో అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.