News

కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌లే… ఊడి ప‌డింది!

366views

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించగా, ఆ జెండా పై నుంచి కిందపడింది. జెండాను ఆవిష్కరించినప్పటికీ ఎగురవేయలేకపోయారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో వ్య‌వ‌స్థాపక దినోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. 137వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా పార్టీ అధ్య‌క్షురాలు సోనియా పార్టీ జెండాను ఎగుర‌వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

జెండాకు క‌ట్టిన తాడును కార్యాల‌య సిబ్బంది వేగంగా లాగగా.. సోనియా కూడా అంతే వేగంతో తాడును లాగారు. జెండా కాస్త ఊడిపోయి సోనియా మీద ప‌డిపోయింది. ఓ మ‌హిళా కార్య‌క‌ర్త వేగంగా వ‌చ్చి.. జెండాను స‌ర్దే ప్ర‌య‌త్నం చేశారు. కానీ చివ‌ర‌కు ఆ జెండాను ఎగుర‌వేయ‌కుండానే ప‌క్క‌కు పెట్టేశారు.

పార్టీ కోశాధికారి పవన్ బన్సాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి సోనియాగాంధీ చేతిలో పార్టీ పతాకాన్ని పట్టుకుని కొద్దిసేపు ప్రదర్శించారు. అనంతరం ఒక కాంగ్రెస్ కార్యకర్త పార్టీ త్రివర్ణ పతాకాన్ని ఉంచేందుకు జెండా స్తంభంపైకి ఎక్కాడు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున్ ఖర్గే తదితరులు పార్టీ ప్రధాన కార్యాలయంలో పాల్గొన్నారు. ఇక సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని కార్య‌క‌ర్త‌లు నిన‌దించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి